Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రణ్ వీర్ సింగ్ అంటే చాలా చాలా ఇష్టం: రకుల్

  • 'దే దే ప్యార్ దే'కి మంచి రెస్పాన్స్ 
  • రకుల్ గ్లామర్ కి మంచి మార్కులు
  •  రణ్ వీర్ సింగ్ గురించి రకుల్ మాటలు
ఒక వైపున తెలుగులో .. మరో వైపున తమిళంలో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ పై రకుల్ దృష్టి పెట్టింది. హిందీలో ఆమె చేసిన 'దే దే ప్యార్ దే' సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా వసూళ్లు పెరుగుతుండటంతో రకుల్ ఫుల్ ఖుషీ అవుతోంది. బాలీవుడ్ లోని కొంతమంది దర్శక నిర్మాతలు ఆమెను తమ ప్రాజెక్టుల్లోకి తీసుకునేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారట.

తాజా ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ, తన సినిమాకి లభిస్తోన్న ఆదరణ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది. పనిలో పనిగా రణ్ వీర్ సింగ్ ప్రస్తావన తీసుకొచ్చింది. ఆయనంటే తనకి ఎంతో ఇష్టమనీ, ఆయన ఎనర్జీ ఒక రేంజ్ లో ఉంటుందని అంది. రణ్ వీర్ సింగ్ కి పెళ్లి కాకుండా వుంటే తాను చేసుకుని ఉండేదానినని చెప్పింది. మరి 'ఇప్పటివరకూ ఈ సంగతి చెప్పనే లేదూ' అంటూ కొంతమంది గుసగుసలు పెట్టుకుంటూ ఉండగా, రణ్ వీర్ సింగ్ సినిమాలో ఛాన్స్ కోసమే ఇదంతా అనుకునేవాళ్లు మరికొంతమంది. 
rakul

More Telugu News